Sunday, December 29, 2024

Road Accident : గేదెను ఢీకొన్న కారు.. ఇద్ద‌రు మృతి

కృష్ణా జిల్లా పెనమలూరు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కానూరు సిద్ధార్థ కాలేజ్ వద్ద గేదెను ఢీకొని కారు పల్టీలు కొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న డ్రైన్‌లో దూసుకెళ్లింది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కారును డ్రైన్‌లో నుంచి రోడ్డుపైకి తీసుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అయితే కారు డ్రైవర్ కూడా మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement