తిరుమలలోని అలిపిరి నడకదారిలో మరోసారి ఎలుగుబంటి సంచరించింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని ట్రాప్ కెమెరాలో ఇది రికార్డైంది. గత రెండు రోజులుగా పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని.. భద్రతా సిబ్బంది కాపాలా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కాలినడక మార్గంలో భక్తులు కూడా గుంపులు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -