Sunday, January 5, 2025

Kakinada: కానిస్టేబుళ్లపైకి కారు ఎక్కించిన గంజాయి బ్యాచ్ !

కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది.. ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించింది గంజాయి బ్యాచ్. ఈ సంఘటన నిన్న రాత్రి జరుగగా.. ఇవాళ వీడియో బయటకు వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

గ‌త‌ రాత్రి కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. ఇక అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్నారు స్మగ్లర్లు. దీంతో ఆ కారు ఆపేందుకు ప్రయత్నించగా.. కానిస్టేబుళ్లపైకి ఎక్కించింది గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గంజాయి బ్యాచ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement