శ్రీకాకుళం – అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం 550 ఏళ్ల కల అని, జనవరి 22వ తేదీ భారత దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. శ్రీకాకుళంలో ఇవాల మీడియాతో ఆయన మాట్లాడుతూ… జనవరి 22వ తేదీ భారత చరిత్రలో ఒక మరవరాని రోజుగా ఉంటుందన్నారు. ప్రపంచంలోని హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు అన్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం 550 సంవత్సరాల కలగా పేర్కొన్నారు.
హిందూ బాహుల్య దేశమైన భారతదేశంలో కొన్ని పార్టీల తప్పుడు నిర్ణయాల కారణంగా హిందువులు దెబ్బతిన్నారని విమర్శించారు. ఇక, అయోధ్యలో రాముడు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బాయికాట్ చేయడం దారుణమన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఇది పరాకాష్టగా ఆరోపించారు. దేశ ప్రజలు సంతోషంగా ఉన్న సమయంలో ప్రతిష్టను తగ్గించాలన్న దురాలోచనతో విపక్షాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.