మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్‌లో 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న మానస తేజను మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మానస తేజ ఇచ్చిన వాంగ్మూలం చాలా కీలకం కానుందని పోలీసులు తెలిపారు. అతని వాంగ్మూలం ఆధారంగా మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ఇదే కేసులో పేర్ని నాని భార్య జయసుద ఈ కేసులో నాని భార్య జయసుధ ఏ-1 గా ఉన్నారు. కాగా, జయసుధ, కుమారుడు కిట్టును విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ అజ్ఞాతంలో ఉండగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది.