82 లక్షల మంది కొత్త ఓటర్లు
12 లక్సల పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
55 లక్సల ఈవీఎంలు సిద్ధం
ఎన్నికల డ్యూటీలో 1.5 కోట్ల మంది ఉద్యోగులు
గణాంకాలు విడుదల చేసిన ఎన్నికల సంఘం
గతం కంటే 6 శాతం పెరిగిన ఓటర్లు
పురుష ఓటర్లే ఎక్కువ
66 శాతం మంది యూత్ ఓటర్లు
80ఏళ్ల పైబడిన ఓటర్లు రెండు కోట్లు
100 ఏళ్లపై బడిన ఓటర్లు 2.38 లక్షలు
న్యూఢిల్లీ – లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్‌లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్ వెల్లడితో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
97 కోట్ల మంది ఓటర్లు..
సాధారణ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు, ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా, ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. అందులో 82 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 12 లక్షల పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారని చెప్పారు.
ప్రపంచంలో భారత్ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల ముందు ఈ సమాచారాన్ని ఇస్తుంది. ఈసారి కూడా ఎన్నికల సంఘం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్లకు సంబంధించిన ప్రత్యేక సారాంశ సవరణ 2024 నివేదికను విడుదల చేసింది. దేశంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు, స్త్రీ, పురుష ఓటర్లు ఎంత మంది ఉన్నారు, ఎంత మంది ప్రజలు తమ ఎంపీని మొదటిసారి ఎన్నుకుంటారు. ఆయా వివరాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని కమిషన్ తెలిపింది. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 21 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేసింది. దేశంలో 48 వేల ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 48,000 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు వేయడానికి అర్హులని ఆయన ఈరోజు తెలిపారు. మొత్తం 97 కోట్ల మంది ఓటర్లలో 48,000 మంది లింగమార్పిడి ఓటర్లు ఉన్నారని చెప్పారు.
2019 లోక్‌సభ ఎన్నికలలో లింగమార్పిడి ఓటర్ల సంఖ్య 39,075 ఉండగా.. వారిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ (7,797), తమిళనాడు (5,793), కర్ణాటక (4,826) ఉన్నారు. లింగమార్పిడి ఓటర్లు లేని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలుగా గుర్తించారు.
ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 976 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. గణాంకాల ప్రకారం ఈసారి 6 శాతం కొత్త ఓటర్లు చేరారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు మన దేశంలోనే ఉన్నారు. 2.63 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో మహిళల వాటా ఎక్కువ. 1.41 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్ల వాటా 1.22 కోట్లు మాత్రమే. థర్డ్ జెండర్ కేటగిరీ ఓటర్లు 48,044 మంది ఉన్నారు. దేశంలోని మొత్తం జనాభాలో 66.76 శాతం మంది యువత అంటే ఓటు వేసే వయోజనులు. ఓటర్ల లింగ నిష్పత్తి కూడా 2023లో 940 ఉండగా, 2024లో 948కి పెరిగింది. అంటే 1000 మంది పురుషులకు గాను 948 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో లింగ నిష్పత్తి 928గా ఉంది.
వృద్ధ ఓటర్ల సంఖ్య ఎంత?
80 ఏళ్లు పైబడిన ఓటర్లు 1 కోటి 85 లక్షల 92 వేల 918 మంది ఉన్నట్లు కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. అలాగే 100 ఏళ్లు పైబడిన వారు 2 లక్షల 38 వేల 791 మంది ఉన్నారు. వికలాంగుల భాగస్వామ్యం 88.35 లక్షలు. కమిషన్ సేకరించిన డేటా ప్రకారం, 1 కోటి 65 లక్షల 76 వేల 654 మంది ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించారు.