Saturday, November 16, 2024

JAWAD Cyclone: ప్రయాణికులకు అలర్ట్: 95 రైళ్లు రద్దు

రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏపీలో ‘జావద్’ తుపాను కారణంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికతో రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. మొత్తం 95 రైళ్లను రద్దు చేసింది.

రద్దు అయిన రైళ్లు…

సిల్చార్ త్రివేండ్రం సెంట్రల్‌, త్రివేండ్రం శాలీమార్‌, బెంగుళూరు కంటోన్మెంట్‌- గౌహతి,  అహ్మదాబాద్‌-పూరి ఎక్స్‌ప్రెస్‌, కన్యాకుమారి- దిబ్రుఘర్‌, పూరి- గుణుపూర్, భువనేశ్వర్-రామేశ్వరం, హౌరా-సికింద్రాబాద్ పలకనామ ఎక్స్‌ప్రెస్‌, పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్ రథ్, హౌరా-యశ్వంత్ పూర్-దురంతో, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్, పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్, పురీ-తిరుపతి, హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-మైసూర్ వీక్లీ, సంత్రాగాచ్చి-చెన్నై, విశాఖపట్నం హౌరా ఎక్స్ ప్రెస్, హౌరా-యశ్వంత్ పూర్, హౌరా-చెన్నై మెయిల్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్, రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్, సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్, కొర్బా-విశాఖ. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement