ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్ధిదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాస్తోంది. ఈ మూడేళ్ల పాలనలో సీఎం జగన్ నేతృత్వంలో ఒక్కో కుటుంబానికి ఎంత మేర లబ్ధిజరిగిందనే వివరాలతో ఈ లేఖలను పంపిస్తోంది. ఇట్లాంటి లేఖను ఓ నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ మూడేళ్ల పాలనలో మీ కుటుంబానికి దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఈ పథకాలను అందించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అని సీఎం జగన్ పేరిట లేఖ.. అందులో ఏ పథకానికి ఎంత మేర అందించారనే వివరాలు పొందుపరిచారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తీరును కొంతమంది మెచ్చుకుంటుంటే.. ఇంకొంతమంది తప్పుపడుతున్నారు.