ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మొన్న 547 కోవిడ్ కేసులు నమోదు కాగా, నిన్న 840 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది. నిన్న 133 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కోవిడ్ తదితర కారణాల వల్ల నిన్న విశాఖపట్నంలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇంతవరకు 20,79,763 మందికి కొవిడ్ సోకగా, వారిలో 20,62,290 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,972 క్రియాశీల కేసులున్నాయని హెల్త్ బులెటిన్ లో పేర్కోన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో కోవిడ్ తదితర కారణాల వల్ల మరణించిన వారి సంఖ్య 14,501 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,15,19, 919 మంది శ్యాంపిల్స్ పరీక్షించారు. కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital