Friday, November 22, 2024

క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి 150 కి.మీ స్కేటింగ్‌.. ప్ర‌పంచ రికార్డు సృష్టించిన 8 ఏళ్ల బాలుడు

ఎనిమిదేళ్ల ఓ బాలుడు దాదాపు 15 గంటలపాటు నాన్‌ స్టాప్‌గా 150 కిలోమీటర్ల పాటు కళ్లకు గంతలు కట్టుకుని స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఏపీలోని పుత్తూరుకు చెందిన ఎనిమిదేళ్ల భారతీ రాజా యువకుడు కర్ణాటక సరిహద్దులోని నంగలి నుంచి నగరి వరకు కళ్లు కప్పి స్కేటింగ్ చేస్తూ వజ్ర వరల్డ్ రికార్డ్స్, గ్లోబల్ వరల్డ్ రికార్డ్, చిల్డ్రన్స్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.

రాజాకు చిన్నప్పటి నుంచే స్కేటింగ్ అంటే ఇష్టం. దీంతో పుత్తూరులోని టాలెంట్ స్కేటింగ్ అకాడమీలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. క‌ళ్ల‌కు గంత‌లు కట్టి, స్కేటింగ్ చేయ‌డానికి ఆ పిల్ల‌వాడు కొన్ని నెలల పాటు సాధ‌న చేశాడు. భారతీ రాజా శుక్రవారం ఉదయం 6:30 గంటలకు నంగలి టోల్ నుండి బయలుదేరి బంగారుపాలెం, చిత్తూరు వై జంక్షన్, జిడి నెల్లూరు, కెబిఆర్ పురం, పుత్తూరు మీదుగా అదే రోజు రాత్రి 9 గంటలకు నగరిలోని పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్‌కె రోజా నివాసానికి చేరుకున్నాడు.

కాగా, సర్క్యూట్ బార్‌లలో లింబో స్కేటింగ్‌లో చాలా మంది రికార్డులు సాధించారు. అయితే, ఎనిమిదేళ్ల చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని స్కేటింగ్ చేస్తూ 150 కిలోమీటర్లు పూర్తి చేయడం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement