గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేత చంద్రయ్య హత్యకేసులో 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలే అని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. మృతుడు తోట చంద్రయ్య, చింతా శివ రామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని.. మూడు సంవత్సరాల క్రితం మృతుడు తోట చంద్రయ్య, నిందితుడు చింతా శివ రామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్డు విషయంలో మధ్య గొడవలు జరిగాయని పోలీసులు తెలిపారు. అప్పటినుండి వారి మధ్య విభేదాలు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన గ్రామంలో తమ బంధువుల వేడుకకు హాజరైన తోట చంద్రయ్య, చింతా శివరామయ్యను చంపుతానని బెదిరించినట్లు ప్రచారం జరిగిందన్నారు. దీంతో చంద్రయ్యను చంపాలని శివరామయ్య, తన కుమారుడుతోపాటు మరో ఆరుగురు అనుచరుల సహాయంతో నిన్న హత్య చేసినట్లు వివరించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital