Wednesday, November 20, 2024

7618 కిలోల హెరాయిన్ పట్టివేత.. గంజాయి సరఫరాలో ఏపీ నెంబర్ వన్ ప్లేస్

హెరాయిన్, గంజాయిల పట్టివేత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదికను విడుదల చేసింది. దేశంలోనే గంజాయి సరఫరా లో ఏపీ (AP) మొదటి స్థానంలో ఉంది. గత ఏడాది మాదకద్రవ్యాల పై ఎన్సీబీ నివేదికను వెలువరించింది. దేశ వ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 26శాతం గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే రెండు లక్షల కిలోలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి సరఫరాలో రెండో స్థానంలో ఒడిస్సా ఉంది.

అత్యధికంగా గుజరాత్‌లో 3334 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ కేసుల్లో రెండో స్థానంలో యూపీ ఉంది. యూపీలో 1337 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. గత ఏడాది తెలంగాణలో 35,270 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీ నివేదిక ప్రకారం అత్యధిక మత్తుపదార్థాల ప్రభావం పంజాబ్‌లో ఉన్నట్టు తేలింది. 50 శాతానికి పైగా ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల నుంచే గంజాయి సాగవుతోంది. గత ఏడాది ఏపీలో 18కిలోల హాశిష్ ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాపై 1775 కేసులు నమోదయ్యాయి. ఏపీలో గంజాయిని తరలిస్తూ పట్టుబడిన 4202 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హెరాయిన్ కేసుల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 7618 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement