Tuesday, November 26, 2024

తుంగభద్రకు పోటెత్తిన వరద.. 75, 843 క్యూసెక్కుల ఇన్‌ప్లో

అనంతపురం, ప్రభన్యూస్‌ బ్యూరో: తుంగభద్ర పరిధిలో రైతుల ఆశలు చిగురించాయి. అనుకున్నదానికంటే ఎక్కువగా జలాశయంలోకి నీరు వస్తుండడంతో, రైతాంగం పంటల సాగుకు సిద్ధమవుతోంది. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాలైన ఆగుంబె, మోరాళ, తీర్ధహళ్లి, శివ మొగ్గ తదితర చోట్ల కురుస్తున్న భారీ వర్షాలతో నదికి నీరు పో-టె-త్తుతోంది. టీ-బీ డ్యాంలోకి 75,843 క్యూసెక్కుల భారీ స్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోంది. గురువారం ఒకే రోజు డ్యాంలోకి 6 టీ-ఎంసీలకు పైగా నీరు చేరడంతో డ్యాంలో నీటి మట్టం 65 టీ-ఎంసీలకు చేరింది.

డ్యాం పూర్తి సామర్ధం 101 టీ-ఎంసీలు. వస్తున్న వరదతో వారం లోపు డ్యాం పూర్తిస్థాయిలో నిండవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 12 నుంచి హెచ్‌ఎల్‌ సీకి, 15 నుంచి ఎల్‌ఎల్సీ కాలువకు నీరు వదిలేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. మరోవైపు హెచ్‌ఎల్సీ పరిధిలోని రైతులు పొలం పనుల్లో మునిగిపోయారు. కాలువలకు నీరు వదిలేలోపు పంటలను వేసు కోవడానికి సన్నద్ధమయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement