Monday, November 25, 2024

Farm Fund Scheme | ఉద్యాన రైతులకు రూ.75 వేలు !

ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్‌-2024 ప‌థ‌కం ద్వారా రైతులకు రూ.75 వేలు సబ్సిడీ అందజేస్తుంది. కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగులో నీటి కొరత సమస్యలను పరిష్కరించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.

నీటి కొర‌త ఉన్న ప్రాంతాల్లో స్థిర‌మైన వ్యవ‌సాయ ప‌ద్ధతుల‌ను ప్రోత్సహిస్తూ.. ఈ పథకం ద్వారా 12 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు జియో-మెమ్బ్రేన్ షీట్ల ద్వారా ఫారం పాండ్లను నిర్మించ‌నున్నారు. వేస‌వి కాలంలో రెండు ఎక‌రాల్లో రెండు పంట‌లకు స‌రిపడా నీటిని అందించ‌గ‌ల సామ‌ర్థ్యం ఈ ఫారం పాండ్లకు ఉంటుంది. కాగా, చెరువు నిర్మాణానికి మొత్తం ఖ‌ర్చు రూ.1.50 ల‌క్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం స‌బ్సిడీ ద్వారా సంగం డ‌బ్బు రూ.75 వేలు ఇస్తుంది.

ఈ స్కీమ్‌కు అవ‌స‌ర‌మైన పత్రాలు

ల్యాండ్ టైటిల్‌, పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌, దర‌ఖాస్తు ఫారం.

దరఖాస్తు ప్రక్రియ

- Advertisement -

మీ సేవ కేంద్రంలో దరఖాస్తు నమోదు చేసుకొని.. దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి రైతు భరోసా కేంద్రంలో (RBK) సమర్పించాలి. అధికారుల ఆమోదం తర్వాత చెరువుల తవ్వకం ప్రారంభించాలి. జియో-మెమ్బ్రేన్ షీట్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. దాన్ని ధ్రువీక‌రించిన త‌రువాత రూ.75 వేల స‌బ్సిడీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు జ‌మ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement