Wednesday, November 20, 2024

700 రోజుకు చేరిన అమ‌రాక‌తి మ‌హోద్య‌మం…

ఒంగోలు, ప్రభన్యూస్‌ : రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన మహోద్యమం మంగళవారంతో 700 వ రోజుకు చేరంది. దీంతో “న్యాయస్థానం నుంచి దేవస్థానం ‘ వరకు చేపట్టిన మహా పాదయాత్ర 16వ రోజు సందర్భంగా రైతులు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకు సాగింది. అమరావతి ఉద్యమం 700వ రోజుకు చేరిన సందర్భంగా రైతులు ఉదయం 7.30గంటలకు రైతులు సర్వమత ప్రార్థనలు చేశారు. 8.15గంటలకు అమరవీరులకు నివాళులర్పించారు. 8.30గంటలకు రైతుల ప్రత్యేక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 9గంటలకు లక్ష్యసాధన ప్రతిజ్ఞ చేశారు. 9.30గంటలకు దళిత మైనార్టీల అమరావతి సంకల్పం చేశారు. 10గంటలకు మహిళలు ప్రత్యేక మాలధారణ చేశారు. 10 నుంచి 12.30గంటల వరకు అమరావతి ఉద్యమ గీతాలాపన చేశారు. మధ్యాహ్నం 2.30గంటలకు ఉద్యమ కాలాల్లో ముఖ్యమైన ఘట్టాల పై వ్యాఖ్యానం చేశారు. 3నుంచి 5గంటల వరకు పాదయాత్ర మార్గమధ్యలో కళ్లకు గంతలతో నిరసన చేపట్టారు. సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.

అమరావతి నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించి 16 రోజులైంది. రాజధాని ఐక్యకార్యాచరణ సమితి అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహా పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని 70 గ్రామాల మీదుగా జరగనుంది. డిసెంబర్‌ 15వ తేదిన తిరుపతిలో యాత్ర ముగియనుంది.అమరావతి ఉద్యమం పెయిడ్‌ ఆర్టిస్టుల ఉద్యమం అని, చంద్రబాబు బినామీల ఉద్యమం అని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఉద్యమం అని వైసీపీ నేతలు రాజధాని ఉద్యమాన్ని టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. నేటికీ రాజధాని విషయంలో అధికార వైసీపీ తీరు అలాగే ఉంది.

న్యాయం గెలుస్తుందని, పాలకులు మారితే రాజధానులు మారవని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్న రైతుల పై పోలీసులు ఆంక్షలు పెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ..అమరావతి ఉద్యమాన్ని నిలువరించే అనేక ప్రయత్నాలు చేశారు. రాజధాని రైతులు లాఠీ దెబ్బలు తినడంతో పాటు, పోలీసు స్టేషన్లకు వెళ్లారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, సీఆర్డీఏ రద్దును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ప్రకాశం జిల్లాలో 16వ రోజు కొనసాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement