ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ 70 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం 1,52,250 క్యూసెక్కుల నీరూ దిగువకు విడుదల చేశారు. సాగునీటి అవసరాల కోసం కృష్ణ ఈస్ట్రన్, వెస్ట్రన్ కాలువలకు 9,547 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,61,797 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 1,52,250 క్యూసెక్కులు ఉంది. పులిచింతల ప్రాజెక్ట్ డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,23,395 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,55,082 క్యూసెక్కులు ఉన్నది. సోమవారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు రానుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement