శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో నేటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాయంత్రం 5:30 గంటల నుండి అంకురారోపణ ధ్వజారోహణ పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు నిర్వహించనున్నారు.
కోవిడ్ ప్రోటోకాల్స్ మధ్య ఏడు రోజుల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుండి 18 వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, స్వామి అమ్మవార్ల కల్యాణం ఏకాంత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital