Saturday, November 23, 2024

AP | ఇంజనీరింగ్‌ విద్యార్థులకు 5జీ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ కోర్సు ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం 5జీ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ కోర్సును ప్రారంభించింది. తాడేపల్లి ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూధన్‌ రెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ కొండూరు అజయ్‌ రెడ్డి మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ డా.వినోద్‌ కుమార్‌ ఈ కోర్సును ప్రారంభించారు.

టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎస్‌సి), జర్మన్‌ అకాడమీ ఆఫ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ (డిఏడీబి) సహకారంతో ఏపీఎఎస్‌ఎస్‌డీసీ ట్రైనింగ్‌తో కూడిన హై-క్లాస్‌ ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ యువతకు ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి కొత్త మార్గాలను కల్పించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ సాంకేతికత రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును పెంపొందించేలా ఈ కోర్సును రూపకల్పన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement