Tuesday, November 19, 2024

కర్నూలులో ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 551వ జయంతి వేడుకలు

విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయలు 551వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగర కేంద్రంలోని ధర్నా చౌక్ కృష్ణ దేవరాయల విగ్రహం వద్ద కర్నూలు జిల్లా, నగర బలిజ,తెలగ, కాపు, ఒంటరి సేవా సంఘం, జిల్లా బలిజ ఉద్యోగుల వృత్తి నిపుణుల సంఘం, కాప్స్ రాక్స్, కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి చంద్రబాబు, జిల్లా పెద్దలు యర్రంశెట్టి నారాయణ రెడ్డి, డాక్టర్ కుళ్ళయప్ప, డాక్టర్ కొట్టె చెన్నయ్య, పత్తి ఓబులయ్య, చింతలపల్లి రామకృష్ణ, అర్జా రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు తదతరులు కలసి కృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప పరిపాలనాధక్షుడిగా ప్రపంచ చరిత్రలో ఖ్యాతి గడించాడన్నారు. అలాంటి రాజనీతిజ్ఞుడు, సాహితీ సమారంగణ సార్వభౌముడు బలిజ వంశీయుడు కావటం మనకెంతో గర్వకారణమన్నారు. రత్నాలు రాసులుగా పోసి అమ్మినటువంటి ఘన చరిత్ర కేవలం శ్రీకృష్ణదేవరాయల వారికే దక్కిందని, అంతే కాకుండా తన పరిపాలనలో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి చెరువులు, కుంటలను తవ్వించడం, గొలుసుకట్టు కాల్వల నిర్మాణం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించి దక్షిణ భారత దేశంలో కరువు లేకుండా చేసిన గొప్ప రాజు కృష్ణదేవరాయలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘీయులు గన్నపురెడ్డి శ్రీనివాస రెడ్డి, అమరం నరేష్, పాలెంశెట్టి శ్రీనివాసులు, సురేశ్ మామిళ్ల, సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్, కప్పట్రాళ్ల మోహన్, పెద్దపాడు లక్ష్మన్న, సుబ్రమణ్యం, రాజశేఖర్, ఎక్కంటి శ్రీనివాసులు, యస్.బి మహిపతి, పవన్ కుమార్, పూజల రామ్ భూపాల్ రెడ్డి, కే శ్రీనివాస రెడ్డి, బసిరెడ్డి రాజేష్, సంజీవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement