కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : డివిజన్ విజయవాడ రైల్వే స్టేషన్ మరో మైలురాయిగా అధిగమించింది. ప్రయాణీకులకు అందించే ఉత్తమ సేవలో పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు ప్రతిష్టాత్మకమైన ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్‌ను పొందింది.
ఈ ఘనతతో, విజయవాడ డివిజన్‌లోని రెండవ స్టేషన్‌గా, అన్నవరం, గుంటూరు, నడికుడి & హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ తర్వాత ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేషన్‌ను పొందిన ఎస్సీఆర్ జోన్‌లో ఐదవ స్టేషన్‌గా అవతరించింది. విజయవాడ స్టేషన్ ధృవీకరణ ప్రక్రియలో 85%, అంతకంటే ఎక్కువ మార్కులను పొందింది. ఆదర్శప్రాయమైన ప్రామాణిక 5 స్టార్ ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేషన్‌ను సాధించింది.
ప్రతిష్టాత్మక ఎఫ్ఎస్ఎస్ఏఐ ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేషన్‌ను పొందడంలో ఆదర్శప్రాయమైన కృషి చేసినందుకు విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ.పాటిల్, సీఎంఎస్ డాక్టర్ ఎం. సౌరిబాల, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు; డీసీఎం ఎం. అలీ ఖాన్, స్టేషన్ డైరెక్టర్ ఎం. శైలజ, విజయవాడ డివిజన్‌కు చెందిన ఎఫ్ఎస్ఓ, క్యాటరింగ్, కమర్షియల్ బృందం ఫుడ్ సేఫ్టీ, ఎస్సీఆర్ డాక్టర్ కె. అనిల్ కుమార్, రహమతుల్లాను అభినందించారు.