Friday, November 22, 2024

@ 5 pm – ఏపీలో పోలింగ్ జోరు – 67.99 శాతం పోలింగ్ …

ఏపీలో 25 లోక్ స‌భ స్థానాల‌కు, 175 అసెంబ్లీ స్థానాల‌కు పోలింగ్ కొన‌సాగుతున్న‌ది… 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2వేల 387 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 46వేల 389 పోలింగ్ కేంద్రాల‌లో పోలింగ్ కొన‌సాగుతున్న‌ది.. ..ఇక‌ అరకు, పాడేరు, రంపచోడవరంలో నాలుగు గంట‌ల వ‌ర‌కే పోలింగ్ ముగియ‌గా,, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ ముగిసింది. మిగిలిన ప్రాంతాల‌లో ఆరు గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ను అనుమ‌తించారు.. అయితే ఆరు దాటిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఉండటంతో వారిని పోలింగ్ కు అనుమతించారు…

- Advertisement -

ఏపీలో 5 గంట‌ల వ‌ర‌కు పోలైన ఓట్ల శాతం.
అల్లూరి సీతారామరాజు మన్యం 55.17
అనకాపల్లి 65.97
అనంతపురం 68.04
అన్నమయ్య 67.63
బాపట్ల 72.14
చిత్తూరు 74.06
కోనసీమ 73.55
తూర్పు గోదావరి 67.93
ఏలూరు 71.10
గుంటూరు 65.58
కాకినాడ 65.01
కృష్ణా 73.53
కర్నూలు 64.55
నంద్యాల 71.43
ఎన్‌టీఆర్ 67.44
పల్నాడు 69.10
పార్వతిపురం 61.18
ప్రకాశం 71.00
నెల్లూరు 69.95
శ్రీసత్యసాయి 67.16
శ్రీకాకుళం 67.48
తిరుపతి 65.88
విశాఖపట్నం 57.42
విజయనగరం 68.16
పశ్చిమ గోదావరి 68.78
కడప 72.85

Advertisement

తాజా వార్తలు

Advertisement