Tuesday, November 26, 2024

ఎండ దెబ్బ‌కు 5 ల‌క్ష‌ల‌కు పైగా లేయ‌ర్ కోళ్లు మృతి…ఘోల్లుమంటున్న నిర్వాహ‌కులు

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై రోజులుగా వాతావరణం అగ్నిగుండంలా మారడంతో పౌల్ట్రీ రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అత్యధిక ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడు కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదు లక్షలకు పైగా లేయర్‌ కోళ్లు చనిపోయినట్లు- అంచనా. దీంతో పౌల్ట్రీ యజమానులకు సుమారు రూ.25 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు- చెబుతున్నారు. వడగాల్పుల నుంచి కోళ్లను కాపాడుకోవడానికి రైతులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. వీటిని దహనం చేయడం రైతులకు మరింత భారంగా మారింది. ఒక్కొక్క కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో గుడ్లు పెట్టే కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లు చనిపోకుండా కాపాడేందుకు కోళ్ల ఫారాల చుట్టూ రైతులు గోనె సంచులు కట్టి తడుపుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలకు కోళ్లు తట్టు-కోలేక మేత సరిగా తినడం లేదు, నీళ్లు తాగడం లేదని.. ఫలితంగా అవి వడదెబ్బకు గురై చనిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

గిట్టు-బాటు- కావటం లేదంటూ.. పౌల్ట్రీ రైతుల ఆందోళన..
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1018 పెద్ద కోళ్ల ఫారాలు వుండగా చిన్నా చితకా మరో రెండు వేలకు పైగా కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో 50 నుంచి 60 శాతం వరకు గుడ్లు పెట్టే కోళ్లు పెంచుతున్నారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని తెలిసి కోళ్ల పెంపకం రైతులు కాస్త తగ్గించిన నష్టాలు తప్పలేదు. పదానంగా విశాఖ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణ, రాయల సీమ జిల్లాల్లో ఎక్కువగా కోళ్లను పెంచుతున్నారు. ముఖ్యంగా గత పడి రోజులుగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో వీటిని బాయిలర్‌ లో వేసి తగలబెడుతున్నారు. కోళ్లకు చర్మ రంధ్రాలు ఉండకపోవడం వల్ల శరీరంలో వేడి నోటి ద్వారానే బయటికి పంపించాలి. అందుకే ఎక్కువ ఉష్ణోగ్రతను ఇవి తట్టు-కోలేక మృత్యువాత పడుతున్నాయి. గుడ్లు పెట్టే కోడి పిల్లను కొనడానికి రైతులు రూ. 45 పెడుతున్నామని. కోడిని గుడ్డు పెట్టే స్థాయికి పెంచడానికి ఒక్కొక్కదానికి 325 రూపాయలకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు.

రాష్ట్ర పౌల్ట్రీ రంగానికి గడ్డుకాలం
అసలే పెరిగిన దాణా ధరలతో గిట్టు- బాటు- కాక ఆర్థిక బాధలు ఎదుర్కొంటు-న్న పౌల్ట్రీ రంగానికి అధిక ఉష్ణోగ్రతలతో భారీ ఎత్తున కోళ్లు చనిపోవడం ఆర్థికంగా మరింత దెబ్బ తీసినట్లయింది. ఒక కోడి 80 వారాల వరకు గుడ్లు పెడుతుందని.. మే నెల ప్రారంభం నుంచి కోళ్లు గుడ్లు పెట్టకపోవడంతో సగం ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కోళ్ళను కూలీలతో మోయించి ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నామని పేర్కొన్నారు. కోళ్లు తగలపెట్టే బాయిలర్లు ఉన్నచోటకు తరలించి అక్కడ కాల్చివేస్తున్నారు. ఇలా ఒక్కొక్క కోడిని దహనం చేయడానికి రైతు 30 రూపాయలు పైన ఖర్చు పెట్టాల్సి వస్తోందని పౌల్ట్రీల్ర యజమానులు వాపోతున్నారు.

గుడ్డు తెచ్చిన కష్టం.. ఉత్తరాది వ్యాపారులతో నష్టపోతున్న రాష్ట్ర పౌల్ట్రీ రంగం
ఒక పక్క కోళ్లు చనిపోయి నష్టపోగా.. మరోపక్క వీటిని దహనం చేయడానికి ఖర్చు చేయడం రైతులను మరింత నష్టాల్లోకి నెట్టు-తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడదెబ్బ నుంచి కోళ్లను కాపాడడానికి రైతులు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమవుతున్నాయని వివరించారు. ఈ ఎండలు ఇలాగే ఉంటే మొత్తం ఫారాలన్నీ ఖాళీ అయిపోతాయని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న ప్రభుత్వం నుంచి ఎటు-వంటి సాయం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement