Friday, November 22, 2024

Delhi: ఎన్డీఏ కూట‌మికి 400 సీట్లు ఖాయం – చంద్ర‌బాబు

వార‌ణాసి మోదీ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో టీడీపీ అధినేత
మోదీ ప‌దేళ్ల పాల‌న భేష్
2047 నాటికి వికసిత్ భార‌త్ ల‌క్ష్యం
మోదీ మూడోసారి ప్ర‌ధాని కావ‌డం త‌ధ్యం
ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మికి నాలుగు వంద‌ల స్థానాలు రావ‌డం గ్యారెంటీ అని అన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ముచ్చ‌ట‌గా మూడోసారి మోదీ ప్ర‌ధాని అవుతార‌నే ధీమా వ్య‌క్తం చేశారు.. వార‌ణాసిలో ఇవాళ‌ జ‌రిగిన ప్ర‌ధాని మోదీ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ… వారణాసి పవిత్రస్థలం.. మోడీ నామినేషన్ ఓ చారిత్రక ఘట్టమ‌ని అన్నారు.

గత పదేళ్లుగా మోదీ అద్భుతమైన పాలన అందించార‌ని ప్ర‌శంసించారు… దేశం మళ్లీ మోదీనే కోరుకుంటుంద‌ని చెప్పారు… ప్రపంచవ్యాప్తంగా మన దేశం రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించనుంద‌ని అంటూ ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు ఎంపీ సీట్లు సాధిస్తుందన్నారు. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఆ ల‌క్ష్యం వైపు సాగ‌డంలో త‌మ వంతు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement