Friday, November 22, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 40గంటలు.. ఫొటోగ్రాఫర్ల కెమెరాలు హుండీలో వేసిన అధికారులు

భక్తుల రద్దీతో తిరుమల కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి దాదాపు 40 గంటలు పడుతోందని అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని వివరించారు. ఆలయం ముందు భక్తులను ఇబ్బంది పెడుతున్న ఫొటోగ్రాఫర్లను కట్టడి చేయడానికి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా గుడి ముందు ఫొటోలు తీస్తున్న వారి నుంచి కెమెరాలు లాక్కుని హుండీలో వేశారు. మరోసారి దొరికితే చర్యలు తప్పవని ఫొటోగ్రాఫర్లను అధికారులు హెచ్చరించారు.శని, ఆదివారాల్లో తిరుమల కొండలు భక్తజన సంద్రంగా మారాయి. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో క్యూ కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శనివారం మొత్తం 57,104 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 32 వేల మంది తలనీలాలు ఇచ్చారని టీటీడీ అధికారులు చెప్పారు. హుండీల ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement