న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ప్రషాద్ పథకంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు దేవస్థానాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలు పథకంలో భాగంగా ఉన్నాయని బీజేపీ పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు వీటిని పథకంలో చేర్చామన్నారు. అమరావతికి 2015-16లో రూ. 27.77 కోట్లను పర్యాటక గమ్యస్థానం కింద అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించారు. శ్రీశైలం ఆలయాభివృద్ధి కోసం రూ. 37.88 కోట్ల ఖర్చు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,