Wednesday, November 20, 2024

ఏపీకి చేరుకున్న 4.44 లక్షల కొవిషీల్డ్ డోసులు

కరోనా వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న ఏపీకి ఊరట కలిగిస్తూ, రాష్ట్రానికి భారీ సంఖ్యలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 4.44 లక్షల డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఈ టీకాలను అధికారులు గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజి యూనిట్ కు తరలించారు. ఈ డోసులను జిల్లాలకు విడతల వారీగా తరలించనున్నారు. పూణే నుంచి తాజాగా రాష్ట్రానికి చేరుకున్న టీకా డోసులతో వ్యాక్సినేషన్ కొద్దిమేర ఊపందుకోనుంది. అటు, కరోనా వ్యాక్సిన్ల అంశంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఇప్పటివరకు 79,00,175 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. వారిలో రెండు డోసులు అందుకున్నవారు 23,44,455 మంది. ఇంకా 55 లక్షల మందికి పైగా రెండో డోసు కోసం వేచిచూస్తున్నారు. వ్యాక్సిన్ కొరతతో ఏపీలో వ్యాక్సినేషన్ నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement