విద్యాధరపురం, (విజయవాడ) ప్రభ న్యూస్ : నార్కొటెక్ డ్రగ్స్ 4 కేజీలకు పైగానే విజయవాడ నొవొటల్ హోటల్ సమీపాన ఒక కొరియర్ సంస్ధ ద్వారా బెంగళూరుకు పంపారు. బెంగళూరు కస్టమ్స్ అధికారులు సంబంధిత కొరియర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తొంది. కొరియర్ సంస్ధకు ఫోన్ చేసిన బెంగుళూరు అధికారులు ఎవరి ఆధార్ కార్డు పేరుతో ఈ కొరియర్ బుక్ చేశారో వారిని బెంగళూరు పంపించవల్సిందిగా సూచించారు. సదరు సమాచారం అందుకున్న కొరియర్ సంస్ద ప్రసాదంపాడుకు చెందిన యువకుడిని బెంగళూరు పంపించారు. గత కొన్నాళ్ళుగా కొరియర్ సంస్ధలో పనిచేస్తున్న యువకుడు తనకు మరొక వ్యక్తి ఈ ప్యాకెట్ అందజేసి తన దగ్గర ఆధార్ కార్డు లేదని కొరియర్ సంస్ధ యువకుడి పేరుతోనే బుక్ చేయించారని, ఆ యువకుడు తెలిపినట్టు సమాచారం.
బెంగళూరు కస్టమ్స్ అధికారులు కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్ సంబంధించిన కొరియర్ ప్యాకెట్‌ను కొరియర్ సంస్ధ యువకుడు ముందే ఒపెన్ చేశారని సమాచారం. 4 కేజీలకు పైగానే డ్రగ్స్ ఉన్నాయని విజయవాడలో ఈ డ్రగ్స్ ఎవరు ఎక్కడ ఇచ్చారని , కొరియర్ చేసిన వ్యక్తిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనకు భవానీపురం నుంచి వచ్చే వ్యక్తి తమ కొరియర్ ద్వారా ఇతర ప్రాంతాలకు కొన్ని ప్యాకెట్లు పంపిస్తుంటారని తెలిపినట్లు సమాచారం. కస్టమ్స్ అధికారులు సంబంధిత వ్యక్తి గురించి కూపీ లాగుతున్నట్టు సమాచారం. ఇంతకీ ఈ ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..