తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై మెజార్టీ కార్పొరేటర్లు శుక్రవారం అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. తీర్మానానికి సంబంధించిన లేఖను 33 మంది కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ద్వారంపూడి వీరభద్రారెడ్డి సారథ్యంలో కలెక్టరేట్‌కు వెళ్లిన కార్పొరేటర్లు.. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లేఖను పరిశీలించి పూర్వాపరాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, ఇటీవలే మేయర్ పావని, డిప్యూటీ మేయర్లు నాలుగేళ్ల పదవికాలం పూర్తి చేసుకున్నారు.
ఇది కూడా చదవండిః ఏపీలో కర్ఫ్యూ పొగిడింపు… కొత్త నిబంధనలు ఇవే..