Friday, November 22, 2024

తిరుపతి పార్లమెంటు పరిధిలో 30 వేల దొంగ ఓట్ల నమోదు : అచ్చెన్నాయుడు

తిరుపతి సిటీ : ఈనెల 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తిరుపతి పార్లమెంటు పరిధిలో 30 వేల వరకు అధికార వైఎస్ఆర్సి పిదొంగ ఓట్లు నమోదు చేయడం జరిగిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక తిరుపతి నగరంలోని 15 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు ఆధారాలతో పాటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు. 2019 ఎన్నికల్లో ఒక అవకాశం ప్రజలు ఇవ్వమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను నట్టేట్లో ముంచడం జరిగిందన్నారు. తిరుపతి నగరంలో స్థానిక సంస్థ ఎన్నికల అప్పుడు, పార్లమెంటు ఉప ఎన్నికల అప్పుడు, తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలప్పుడు అత్యధికంగా దొంగ ఓట్లు నమోదు చేసి అడ్డంగా గెలవడం జరిగిందన్నారు అదే పందాలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లను నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రపంచ పటంలో తిరుపతి నగర క్యాతిని జగన్మోహన్ రెడ్డి వినిపిస్తున్నారు అన్నారు. ఏపీ పేరు వింటేనే పక్క రాష్ట్రాల వారు అసహ్యించుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యమైన ఎన్నికగా మార్చారన్నారు. దొంగ ఓట్లు పై ఆధారాలతో సహా ఆశ్రమిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను చాలెంజిగా తీసుకున్నామన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రభుత్వ ఉద్యోగులు. ఉపాధ్యాయులు. కాంటాక్ట్ ఉద్యోగులు మరోసారి నమ్మించి మోసం చేస్తున్నందుకు ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఇచ్చిన ఆమెని నెరవేర్చి పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి లేరన్నారు. ఉపాధ్యాయులను ప్రలోభ పెట్టి వారికి 5000 ఫోన్ పే చేసి ఓట్లను కొనుకుంటున్నారన్నారు.

ఉపాధ్యాయులారా ఆలోచించండి జీతాలు సక్రమంగా ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని పేర్కొన్నారు. వారిని మోసం చేసేందుకు చర్చలు పేరుతో పిలిచి ఈ నెల 31వ తేదీకి వారికి రావాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తామని చెప్పి మరోసారి మోసం చేస్తున్నారని తెలియజేశారు. బోగి సర్టిఫికెట్లతో దొంగ ఓట్లు చేర్పించుకుని ఎన్నికల్లో అధికార పార్టీ గెలవాలని చూస్తున్నది అన్నారు. బోగి సర్టిఫికెట్లతో నమోదైన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటే వారు జైలుకు తప్పదని హెచ్చరించారు. అన్ని ఆధారాలతో ఈనెల 13వ తేదీ జరిగిన ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు దగ్గర ఓట్లు సంబంధించి వారి ఫోటోలు ఓటర్ కార్డులు నెంబర్లు మొత్తం లిస్ట్ వారికి అందజేయడం జరుగుతున్నది అన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి కంచర్ల డాక్టర్ శ్రీకాంత్, పడమర పట్టుబద్రుల అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి, గెలిపించాలని కోరారు. అలాగే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి రమణారెడ్డిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సహజ సిద్ధమైన వనరులు కూడా అధికార పార్టీ డ్యూటీ చేసి డబ్బులు సంపాదించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే గెలుపు తెలుగుదేశం పార్టీ కానీ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర. ఎమ్మెల్సీ పరిశీలకులు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నియోజకవర్గ ఇన్ చార్జి సుగుణమ్మ, పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, జిల్లా అధ్యక్షుడు పులిపర్తి నాని, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, రాష్ట్ర కార్యదర్శులు సూర సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి కృష్ణారెడ్డి, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉ కా విజయ్ కుమార్, కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ, రాష్ట్ర మహిళా కార్యదర్శి పుష్పావతి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement