ఏపీలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో… మరట్వాడా మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప, కర్నూలులో వానలు పడవచ్చని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర – దక్షిణ ద్రోణి, మరట్వాడా నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక, రాయలసీమ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినట్టు వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement