ప్రభ న్యూస్, (ఎన్టీఆర్ బ్యూరో ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మకి భక్తులు పెద్ద ఎత్తున కానుకల వర్షం కురిపించారు. అమ్మవారికి వివిధ రూపాలలో బంగారం, వెండి, నగదును భక్తులు పెద్ద ఎత్తున మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న మహా మండపం ఆరవ అంతస్తులు గడిచిన 12 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.
12 రోజులకు నగదు రూ.2,39,27,007/- లు, కానుకల రూపములో బంగారం 450 గ్రాములు, వెండి 7 కేజీల 570 గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు. విదేశీ కరెన్సీ యుఎస్ఏ 9986 డాలర్లు, ఇంగ్లాండ్ 80 పౌండ్లు, కెనెడా 5 డాలర్లు, ఆస్ట్రేలియా 200 డాలర్లు, యూరోప్ 210 యూరోలు, సింగపూర్ 24 డాలర్లు, మలేషియా 110 రింగెట్లు, యూఏఈ 17,000 దిర్హమ్స్, కువైట్ 7 దినార్లు, హాంకాంగ్ 20 డాలర్లు భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు.
ఆన్లైన్ ఈ హుండీ ద్వారా రూ 40,557/- రూపాయలను భక్తులు చెల్లించుకున్నారు. ఇవ్వాల (శనివారం) నిర్వహించిన హుండీ లెక్కింపు నందు ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి శ్రీ కె.ఎస్ రామరావు, పాలకమండలి సభ్యులు బచ్చు మాధవీ కృష్ణ , సహాయ కార్యనిర్వాహణాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్, I-టౌన్ పోలీసు సిబ్బంది, సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.