Saturday, November 23, 2024

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా 2,500 ఉద్యోగాలు.. 18 వేల నుంచి 3 లక్షల వరకు జీతం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ప్లిప్‌ కార్ట్‌ ముందుకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి, సీఈఓ ఎస్‌.సత్యనారాయణ వెల్లడించారు. గురువారం తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో ఎపిఎస్‌ఎస్‌డిసి, ప్లిnప్‌ కార్ట్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట లో ని నిరుద్యోగ యువతకు తమ సంస్థలో దాదపు 2500 ఉద్యోగాలు కలిపిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ స్థానికంగా ఉండే యువతకు 75 శాతం ఉద్యోగాలు కలిపించడం కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు.

ఈ నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ప్లిnప్‌ కార్ట్‌ ముందుకు రావటము చాల సంతోషంగా ఉందన్నారు. అనతరం ప్లిnప్కార్ట్‌ ప్రక్తినిధులు మాట్లాడుతూ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ ముందుంటు-ందని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోని యువతకు ఉద్యాగాలు కలిపించుటకు ప్లిnప్‌ కార్ట్‌ కూడా భాగస్వాములు అవడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక యువతకు వారి హర్హతలను బట్టి రూ.18000 నుండి రూ.3,00,000 వరకు వేతనంతో 2500 ఉద్యోగాలు కలిపిస్తాము అని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామకోటిరెడ్డి, ప్లిప్‌ కార్ట్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement