Saturday, November 23, 2024

AP | ఏడాదిలోగా 25 వేల ఉద్యోగాలు : మంత్రి సవిత

ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. మంగళగిరిలోని ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ కార్యాలయంలో మంత్రి సవిత శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని… ఏపీ ఖాదీ గ్రామ పరిశ్రమల బోర్డు ద్వారా ఏడాదిలోగా 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో శిక్షణా కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు రుణాలు మంజూరు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 8వ తరగతి విద్యార్హత ఉన్న యువతకు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు అందించి ఉపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement