వేసవి సెలవుల కారణంగా పలు ప్రాంతాల నుండి వస్తున్న భక్తులతో తిరుమలలో రద్దీ పెరిగింది. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకోగా 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ. 3.77 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement