Sunday, November 24, 2024

AP | విశాఖ‌లో ఇక నుంచి 24 గంటల విమాన సర్వీసులు..

విశాఖపట్నం విమానాశ్రయంలో ఇక నుంచి 24 గంటలూ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. గత ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం విమానాశ్రయంలో నావికాదళం రీ-సర్ఫేసింగ్ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఇటీవలే పనులు పూర్తి కావడంతో ఏప్రిల్ 1 నుంచి 24 గంటలూ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో పదేళ్లకు ఒకసారి ఈ రీ-సర్‌ఫేసింగ్‌ పనులు చేపడతారు. ఈ క్రమంలో 2023 నవంబర్ 15న పనులు ప్రారంభించి.. 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల కారణంగా విశాఖ విమానాశ్రయం రన్‌వేను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసి ఉంచారు. దీంతో రాత్రి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా విశాఖ-సింగపూర్ మధ్య నడిచే సర్వీసుతో పాటు దాదాపు పది సర్వీసులు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement