Friday, November 22, 2024

కొత్త‌గా 200 జూనియ‌ర్ కాలేజీలు : ఆదిమూల‌పు సురేష్

విద్యా ప్రమాణాల మెరుగుదలకు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి అమలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రతి మండలానికి ఒక కో-ఎడ్యుకేషన్‌ కళాశాల, బాలిక జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. వృత్తివిద్య కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 200 జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. బాలికల కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement