Monday, November 25, 2024

Trains Cancelled – ఎపిలో భారీ వ‌ర్షాలు…20 రైళ్లు ర‌ద్దు…

అమరావతి: భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా కారణాల రీత్యా వీటిని రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. శని, ఆది, సోమవారాల్లో 20 వరకు రైళ్లు రద్దయ్యాయి.

విజయవాడ- తెనాలి, విజయవాడ- గూడురు, తెనాలి- రేపల్లె, గుడివాడ- మచిలీపట్నం, భీమవరం- నిడదవోలు, గుంటూరు- రేపల్లె, విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- ఒంగోలు తదితర టౌన్ల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

- Advertisement -

రద్దు చేసిన రైళ్ల వివరాలు

07279 – విజయవాడ టు తెనాలి – సెప్టెంబర్ 1

07575- తెనాలి టు విజయవాడ – సెప్టెంబర్ 1

07500 – విజయవాడ టు గూడూరు – ఆగస్టు 31

07458 – గూడూరు టు విజయవాడ – సెప్టెంబర్ 1

17257 – విజయవాడ టు కాకినాడ పోర్ట్ – ఆగస్టు 31

07874 – తెనాలి టు రేపల్లె – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07875 – రేపల్లె టు తెనాలి – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07869 – మచిలీపట్నం టు గుడివాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07868 – గుడివాడ టు మచిలీపట్నం – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07885 – భీమవరం జంక్షన్ టు నిడదవోలు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07886 – నిడదవోలు టు భీమవరం జంక్షన్ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07281 – నర్సాపూర్ టు గుంటూరు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07785 – రేపల్లె టు గుంటూరు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07976 – గుంటూరు టు విజయవాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

17269 – విజయవాడ టు నర్సాపూర్ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07576 – ఒంగోలు టు విజయవాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07898 – విజయవాడ టు మచిలీపట్నం – ఆగస్టు 31, సెప్టెంబర్ 1

07899 – మచిలీపట్నం టు విజయవాడ – సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2

07461 – విజయవాడ టు ఒంగోలు – సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement