నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లెలో పదోవ తరగతి ప్రశ్నాపత్రం లీకైన మాట అవాస్తవం అని జిల్లా కలెక్టర్ మునజిర్ జిలానీ నమున్ అన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాతనే ఓఎంఆర్ షీట్ లో వివరాల మేరకు ఫోటో తీసినట్లు స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీఈఓను ఆదేశించారు. నివేదిక ఆధారంగా ఫోటో తీసి వాట్సప్ పోస్ట్ కు పాల్పడిన వ్యక్తులపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లిలో పదో పరీక్ష పత్రం లీక్ కావడంతో వీటిపై విద్యా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల డిఈఓ సత్యనారాయణ, ఆళ్లగడ్డ డిఎస్పి రాజేంద్ర రెడ్డి విచారణ నిర్వహించారు. పేపర్ లీక్ అయిందని భావిస్తున్న.. గదిలోని ఉపాధ్యాయునితో పాటు.. ఇన్విజిలేటర్ ని విచారించారు. ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.