శ్రీకాకుళం, మే 30: జూన్ 4వ తేదిన సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరుగనున్న నేపధ్యంలో ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజినీరింగ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు 2 కిలో మీటర్ల వరకు రెడ్ జోన్ గా అమలు చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక గురువారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 8అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లో జరగనున్నది.
నిర్దేశించిన పరిసర ప్రాంతాల నుండి చుట్టు పక్కల రెండు కిలోమీటర్ల పరిధి వరకు రెడ్ జోన్ (నో ఫ్లయింగ్ జోన్) గా ప్రకటించినట్లు తెలిపారు. ఆ రెడ్ జోన్ ప్రాంతంలో డ్రోన్స్ గాని, బెలూన్స్ ఎగురవేయట నిషేధించడమైనదని ఎస్పీ పేర్కొన్నారు. పై నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.