Friday, November 22, 2024

ఏపీలో 2.56 లక్షల మంది వీధి వ్యాపారులు: కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 2. 56 లక్షల మంది వీధి వ్యాపారులు ఉన్నట్టు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ వీధి వ్యాపారుల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం దేశంలో ఎంపిక చేసిన 125 మున్సిపాలిటీలలో ‘ప్రధానమంత్రి స్వనిధి సే సమృద్ధి’ పథకాన్ని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎనిమిది సంక్షేమ పథకాల కింద పీఎం స్వనిధి పథకం కింద ఎంపిక చేసిన వీధి వ్యాపారులు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు ఆయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement