అమరావతి,ఆంధ్రప్రభ : 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం పొందనున్నారు. వీరందరుకి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమీషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాంట్రాక్ట్ టీచర్లగా ఎంపికయిన వారు ఆరు నెలల పాటు ఎలిమెంటరీ విద్యలో అపాయింట్‌మెంట్ పొందిన రెండేళ్లలోపు బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. మానవతావాద దృక్పధంతో 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులను మాత్రమే ప్రత్యేక కేసుగా పరిగణించి కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించారని, దీన్నోక విధానంగా చూడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి డిఎస్‌సిలో నిర్ణయించిన నైపుణ్యాలను ఈ అభ్యర్ధులు రెండేళ్లలో సాధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.