న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణయుగం ప్రారంభించి 18 ఏళ్లు దాటింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీసీ సంఘాల నేతలు ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధిని ఇవ్వాల (ఆదివారం) సందర్శించి నివాళులర్పించారు. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో వారి తండ్రి భాస్కర్ రెడ్డిని కలిసి అనేక అంశాలపై చర్చించారు. అంతేకాకుండా పులివెందులలోని 162 మంది స్వర్ణకారులకు నివాస స్థలాలు, కార్యాలయానికి 5 సెంట్ల స్థలం, 10లక్షలు ఎంపీ నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా, వైఎస్సార్ ఘాట్‌ని సందర్శించి నివాళులర్పించిన వారిలో పులివెందుల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నూరుల్లా, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఏపీ రాష్ట్ర వైఎస్సార్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందుర్తి గురవాచారి ఉన్నారు. కార్యక్రమంలో పులివెందుల స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి చిలకల రాజేష్, గౌరవ అధ్యక్షుడు బొల్లు రవి కుమార్, ఉపాధ్యక్షుడు పూజారి నవీన్ కుమార్, పంచ వృత్తుల సంక్షేమ సంఘం నేత సనత్ కుమార్ ఆచారి, స్వర్ణకారులు గోపి రాజశేఖర్, చాంద్ బాషా, చిన్న మహబూబ్ బాషా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.