Wednesday, January 8, 2025

AP | పోర్ట్ క్యాజువల్ కార్మికుల 15 ఏళ్ల నిరీక్షణకు తెర !

  • ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నిర్ణ‌యం..

అక్కయ్య పాలెం : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు తమ జీవనోపాధి కోసం పోరాడిన విశాఖపట్నం పోర్ట్ కాజువల్ కార్మికులు కళ ఎట్టకేలకు సాకారం అయింది. ఈ మేరకు పోర్టు చైర్మన్ అంగముత్తు క్యాజువల్ కార్మికులకు పోర్ట్ లో ఉపాధి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సోమవారం నరసింహనగర్ రైతు బజార్ వద్ద కార్మికులు ఏర్పాటు చేసిన‌ సమావేశంలో ఆల్ ఇండియా పోర్టు అండ్ డాక్ వర్కర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు డికె శర్మ మాట్లాడుతూ… 347 మంది కార్మికులు తమ తల్లి దండ్రులు ఉద్యోగాలు పొంది ఎన్నో ఏళ్లుగా డి ఎల్ బి, పోర్ట్ ట్రస్ట్ లో సేవలు అందిస్తున్నారని అయితే వారిని దినసరి కూలీలు గానే ఇంతవరకు పరిగినించేవారన్నారు.

తల్లిదండ్రులు ఉద్యోగాలు పొందిన పిల్లలకు ఇన్నేళ్లు తర్వాత చైర్మన్ అంగముత్తు కల్పించుకొని దినసరి నుంచి నెలసరి వేతనాలు చెల్లించడానికి అంగీకరించారని, అలాగే వారందరికీ ఇక మీదట పోర్ట్ లో నిరంతరం ఉపాధి కల్పించడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం నెరవేరిందని.. అయితే ఇది సమిష్టి కృషితోనే సాధ్యమైందన్నారు.

క్యాజువల్ కార్మికుల తరఫున హెచ్ఎంఎస్ జాయింట్ సెక్రటరీ కెఎస్ వర్మ మాట్లాడుతూ… కార్మికులకి ఉపాధి కల్పించిన చైర్మన్ తో పాటు ఆయా విభాగాలు ఉన్నతాధికారులకు,అన్ని యూనియన్ల నాయకులకు, కార్మికులు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో వందలాది మంది కార్మికులు పాల్గొనగా అతిధులను వీరంతా ఘనంగా సత్కరించారు.

ఈ సమావేశంలో పోర్ట్ ట్రస్ట్ ట్రస్టీ అంజిబాబు, హెఎంఎస్ కోశాదికారి మంగయ్య నాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.కోటేశ్వరరావు, పోర్ట్ సలహా మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సామాజిక ఉద్యమకారులు గుండు అప్పలరాజు, బాలు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement