Monday, January 27, 2025

AP | ముఖ్యమంత్రి సహాయ నిధికి 15 లక్షలు విరాళం..

ముత్తుకూరు, (ప్రభ న్యూస్) : విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మత్స్యకార సంఘం నాయకులు అన్ని గ్రామాల నుంచి తమ వంతు సహకారంగా విరాళం అందజేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను కలిసి 15 లక్షల రూపాయలు చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఆ సంఘం నాయకులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు పోలిశెట్టి, మునిరత్నం, శేషయ్య, సర్వేపల్లి నియోజకవర్గ మత్స్యకార కమిటీ విభాగం అధ్యక్షుడు అక్కయ్య గారి ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement