Monday, November 18, 2024

గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థులకు జ్వరం

కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర జ్వరం కలకలం రేపుతోంది. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో 14 మంది విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. శని, ఆదివారాల్లో ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వయసుల వారీగా పిల్లలను వివిధ వార్డుల్లో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. విషయంత తెలుసుకున్న తల్లిదండ్రుల విద్యార్థుల ఆందోళనకు గురవుతున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ నివాస్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతో అస్వస్థతకు గురైనట్టు కలెక్టరు తెలిపారు. కరోనా, డెంగీ నెగటివ్ రిపోర్టులు వచ్చాయని చెప్పారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement