విశాఖపట్నం – ఎపికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని,వాటి ద్వారా 6 లక్షల మందికి పైగా ఉపాధి లభించనుందని ఎపి ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు..ఎపి ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమీట్ ను ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి విశాఖలో ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇన్వెస్టర్ల సమ్మిట్ కు వచ్చిన మహా దిగ్గుజ్జాలకు నా అభి నందనలు . విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరగడం చాలా గర్వంగా ఉంది ఎపికి 13 లక్షల కోట్ల రూ పెట్టు బడులు వస్తున్నాయని గర్వంగా ప్రకటిస్తున్న.. ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. .. 92 ఎంవో యులు కుదుర్చు కుంటున్నాం అలాగే 340 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి.. తొలి రోజునే 20 రంగాల్లో పెట్టుబడులు పెట్ట డానికి ముందుకు వచ్చారు 8.54 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంవోయులు మొదటి సమ్మిట్ ఈరోజు జరుగు తాయి . మిగిలిన కొన్ని ఎంవోయులు రేపు శనివారం జరుగుతాయి విశాఖ చిన్న ఏకానిమిక్ హబ్ మారుతుంది ఇండియలో అతి కీలకమైన రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎగు మతులు పెరిగాయి . జాతీయ,అంతర్జాతీయ సదుపాయా లకు భిన్నంగా రాష్ట్రం ఉంది . ముఖ్య మైన జి 20 సదస్సు కు విశాఖ వేదిక గా నిలిచింది . పరిపాలన రాజధాని గా విశాఖ మారనుంది. త్వరలో ఇక్కడ నుండే పాలన మొదలు కానుంది.. నేను ఇక ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తా. రాష్ట్రం అందించే అవకాశాలు మరియు ఆరోగ్యకరమైన పోటీ మరియు దీర్ఘకాలిక భాగస్వామ్యానికి దాని ప్రాధాన్యతను అన్వేషించాలి. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి .. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలలో రాష్ట్రానికి అగ్రగామిగా ఉంది . సుదీర్ఘ తీరప్రాంతంతో సమృద్ధిగా సహజ వనరులను కలిగి ఉంది. ఏపీలో అభివృద్ధి చెందిన ఓడరేవులు, 6 విమానాశ్రయాలు, 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి.. అన్నింటికి మించి నైపుణ్యం కలిగిన యువత ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. ఎపి 11% కంటే జిడిపి నమోదైంది.. ఎగుమతులు పెరిగాయి, SDG లక్ష్యాలలో నీతి అయోగ్ భారతదేశంలో మూడవ స్థానంలో నిలిచింది” అంటూ వివరించారు జగన్..
భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎపికి అవకాశం ఉందని పేర్కొన్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఇది అంటూ ప్రస్తావించారు.. దేశీయంగా అంతర్జాతీయ ఆమోదాల కోసం వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ప్రవేశపెట్టామని, దీని ద్వారా కేవలం 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తామని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు జగన్..