Friday, November 22, 2024

12th Day – పలకరిస్తూ.. పరామర్శిస్తూ .. జగన్ మేమంతా సిద్ధం యాత్ర

పల్నాడు జిల్లాలో కొన‌సాగుతున్న యాత్ర
గంటావారిపాలెం నుంచి యాత్ర ప్రారంభం
క్యాంప్ సైట్ వ‌ద్ద టీడీపీ, జ‌న‌సేన నేత‌ల చేరిక‌
ప‌ల్నాడు వైసీపీ నేత‌లకు జ‌గ‌న్ దిశ నిర్దేశం
జ‌న‌సంద్రంగా మారిని గంటావారిపాలెం
జ‌గ‌న్​కు గ‌జ‌మాల‌తో అభిమానుల స్వాగ‌తం
అయ్యప్పనగర్‌ బైపాస్‌ వద్ద జ‌గ‌న్ ప్ర‌సంగం
రాత్రికి దూళిపాళ్ల‌లో బ‌స

వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, సీఎం జ‌గ‌న్ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర నేటికి 12వ రోజుకి చేరింది. గ‌త రాత్రి బ‌స చేసిన పల్నాడు జిల్లా గంటావారిపాలెం నుంచి బ‌స్సు యాత్ర బుధవారం ఉద‌యం తిరిగి ప్రారంభ‌మైంది. అంత‌కు ముందు గంటావారిపాలెం నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చేరారు. పి.గన్నవరం జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి జనసేన నుంచి పాముల ప్రకాష్, కాండ్రేగుల అనంతబాబు, జనసేన జిల్లా కార్యదర్శి పోతు కాశీ, మాజీ డీసీసీబీ డైరెక్టర్‌ బొంతు జవహర్‌లాల్, మాజీ ఎంపీటీసీ జి ప్రభువర్మ, వై.నాగరాజు, చిలకపాటిశ్రీను, పలువురు ఇతర నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి..

రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్‌ రమేష్‌ కుమార్‌ రెడ్డి టీడీపీ నుంచి లక్కిరెడ్డిపల్లె మాజీ జెడ్పీటీసీ మోహనరెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కె ప్రభాకరరెడ్డి, హాస్పిటల్‌ కమిటీ మాజీ చైర్మన్‌ షేక్‌ హుస్సేన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఓలుదాసు కృష్ణమూర్తి, దివ్యకుమార్‌రెడ్డి, పలువురు ఇతర నేతలు జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరారు. విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గ జ‌న‌సేన ఇన్‌ఛార్జ్‌ పోతిన మహేష్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జనసేన నుంచి విజయవాడ పట్టణ ఉపాధ్యక్షుడు వెన్న శివశంకర్, పశ్చిమ నియోజకవర్గం డివిజన్‌ అధ్యక్షులు షేక్‌ అమీర్‌ బాషా, పి శ్రీనివాసరావు, ఎస్‌ రాముగుప్తా, పిల్లా వంశీకృష్ణ, సోమి గోవిందరావు, ఎం.హనుమాన్, సయ్యద్‌ మొబీనా, జెల్లి రమేష్, పలువురు ఇతర నేతలు కూడా వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు.

పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం

- Advertisement -

మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా వైపీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లాకు చెందిన పార్టీ నేతలు ఆయనను క‌లిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్‌ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ… యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగన్ ఎన్నిక‌ల‌లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై వారికి దిశ నిర్దేశం చేశారు. కార్య‌క్ర‌మంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

గ‌జ‌మాల‌తో స్వాగ‌తం

కాగా జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌తో గంటావారిపాలెం జనసంద్రంగా మారింది. దారిపొడవునా భారీగజమాలతో ముఖ్యమంత్రికి ప్ర‌జ‌లు ఘనస్వాగతం పలికారు. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి బస్సుతో పాటు జ‌న‌ప్ర‌వాహం క‌దిలింది. ముఖ్యమంత్రి జగన్‌కు విద్యార్దులు, యువతీయువకులు, చిన్నారులతో సహా తల్లులు, అవ్వాతాతలు దారిపొడవునా సంఘీభావం తెలిపారు. ఇది ఇలా ఉంటే బ‌స్సు యాత్ర పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్‌, రొంపిచర్ల క్రాస్‌ విప్పెర్ల, నకరికల్లు దేవరంపాడు క్రాస్ వ‌ర‌కు సాగింది.. అక్క‌డ జ‌గ‌న్ లంచ్ విరామం తీసుకున్నారు.. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్‌ మీదుగా అయ్యప్పనగర్‌ బైపాస్‌కు చేరకున్నారు. అయ్యప్పనగర్‌ బైపాస్‌ వద్ద ‘మేమంతా సిద్ధం’బహిరంగ సభలో​ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.. ప్ర‌సంగం అనంత‌రం కొండమోడు జంక్షన్‌, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్లకు చేరుకోని అక్క‌డే రాత్రికి బ‌స చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement