ఒడిశా రైలు ప్రమాద ఘటన మీద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో ఆరు స్టేషన్లు ఉన్నాయ విశాఖపట్రం, ఏలూరు, తాడేపల్లి గూడెం, తెనాలి, నెల్లూరు, ఒంగోలు స్టేషన్లు ఉన్నాయి. రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, బాపట్ల, తెనాలి, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంటలకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది తెలుగు వారు ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. అయితే వీరితో ఎంతమంది ప్రమాదానికి గురయ్యారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు..
కోరమాండల్ లో ఎక్కి ఆంధ్ర ప్రదేశ్ కు చేరాల్సిన ప్రయాణీకుల వివరాలు
మొత్తం 178 మొత్తం
1AC – 9
11 AC – 17
3A – 114
స్లీపర్: 38
రైలులో విజయవాడ ప్రయాణికులు
..ఇదిలాఉంటే.. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 120 మంది విజయవాడ ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా షాలిమార్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం నేపథ్యంలో వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో టోల్ ఫ్రీ నెంబర్‌కు భారీ సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. అయితే, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఈ ఉదయం 10కి విజయవాడ చేరాల్సి ఉండగా.. ఇంతలోనే ఈ ఘోరం జరుగడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.హెల్ప్‌లైన్ నెంబర్స్ ఇవే..ఒడిశా రైలు ప్రమాదంపై విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు. విజయవాడ హెల్ప్ లైన్ నెంబర్ 0866-2576924, రాజమహేంద్రవరం హెల్ప్ లైన్ నెంబర్ 0883-2420541, విశాఖ రైల్వేస్టేషన్‌లోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు అధికారులు