Friday, November 22, 2024

అంబులెన్స్ లేక.. స్కూటీపై 120 కి.మీ. బిడ్డ మృత‌దేహంతో ప్ర‌యాణం

విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చంటిబిడ్డ మరణించింది. చంటి బిడ్డ మృతదేహం తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో స్కూటీపై 120 కిలోమీటర్లు ప్రయాణించి పాడేరుకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అల్లూరి జిల్లా కుమడ గ్రామానికి చెందిన దంపతుల చిన్నారి గురువారం విశాఖ కేజీహెచ్ మరణించింది. విశాఖ కేజీహెచ్ నుంచి పాడేరు వరకు 120 కి.మీ దూరం స్కూటీపై చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు ప్రయాణం చేశారు. చిన్నారి మృతదేహం తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని కోరినా కేజీహెచ్ సిబ్బంది ఇవ్వలేదని, బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇక చేసేందేంలేక స్కూటీపై చిన్నారి మృతదేహాన్ని 120 కి.మీ తీసుకెళ్లినట్టుగా బాధితులు తెలిపారు. స్కూటీపై మృత శిశువును తీసుకెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న వైద్య సిబ్బంది అప్పుడు స్పందించి పాడేరుకు అంబులెన్స్ ను పంపించారు. పాడేరు నుంచి అంబులెన్స్ లో చిన్నారి మృతదేహాన్ని కుమడ గ్రామానికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement