Friday, November 22, 2024

KNL: అక్రమంగా తరలిస్తున్న 120సంచుల పీడీఎస్ రైస్ సీజ్..

ముగ్గురు అరెస్టు… వాహనం సీజ్…
నంద్యాల బ్యూరో, ఆగస్టు 13 ప్రభ న్యూస్ : జిల్లాలో అక్రమంగా తరలిస్తున్నపీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. బుధవారం తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో పీడీఎస్ రైస్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు నంద్యాల హెడ్ క్వాటర్ నుండి తన సిబ్బందిని పంపి వాటిని స్వాదినం చేసుకోవడం జరిగింది. అనంతరం తాలూకా పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎం.దస్తగిరి బాబు, ఎస్ఐ జె.నాగరాజు, నంద్యాల సివిల్ సప్లయ్ అధికారి ప్రసాదు, సిబ్బంది విచారణ చేప‌ట్టారు.

ఆటోనగర్ లో హైవే బ్రిడ్జ్ క్రింద శ్రీ జంబుల పరమేశ్వరి దేవాలయం వద్ద వెల్దుర్తికి చెందిన శోభన్ బాబు ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన పీడీఎస్ బియ్యాన్ని, శోబన్ బాబు చెప్పిన చోట వదిలిరమ్మని తన యజమాని చాకలి మధు చెప్పగా, చాకలి జనార్దన్, తండ్రి చాకలి బాలుడు 120 సంచుల బియ్యాన్ని తన లారీలో లోడ్ చేసుకొని, ఆ తరువాత శోబన్ బాబు చెప్పిన మేరకు బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు.

నంద్యాల ఆటో నగర్ ఊరి వెలుపల కంపచెట్ల వద్ద ఉన్న 25సంచులను లోడ్ చేసుకొని వాటిని కర్నాటక రాష్ట్రంలో ఎక్కువ ధరకు విక్ర‌యించి వద్దామని తెలుపగా, దాచిన 25 సంచులను లోడ్ చేసుకొని వెళ్తుండగా పోలీసులు దాడి చేశారు. చాకలి జనార్దన్ ను అరెస్ట్ చేసి 145 పాస్టిక్ సంచుల్లో వున్న బియ్యాన్ని, లారీని స్వాధీనం చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. ముద్దాయిలైన శోభన్ బాబు, చాకలి మధు, చాకలి జనార్ధన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement